అత్యవసరంగా ల్యాండయిని హెలికాప్టర్
సిద్దిపేట ముచ్చట్లు:
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ పక్కన గల గ్రౌండ్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ZA449 నెంబర్ గల హెలికాప్టర్ సాంకేతిక లోపంతో బుధవారం సుమారు ఉదయం 10:20 నిమిషాలకు ఇక్కడ దిగడం జరిగింది దీంతో చుట్టుపక్కల ప్రజలు పెద్దసంఖ్యలో హెలికాప్టర్‌ను చూసేందుకు తరలి వచ్చారు విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రాజు పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని హెలికాప్టర్కువద్ద కు ప్రజలు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.హెలికాప్టర్ హకీంపేట్ ఎయిర్పోర్ట్ నుండి స్కాన్ లీడర్ ఆకాశ్ గుప్తా కధమ్ ఇద్దరు ఆఫీసర్లు ప్రయాణిస్తుండగా సాంకేతిక లోపంతో ఇక్కడ దిగడం జరిగిందని తెలిపారు.అనంతరం హెలికాప్టర్ మరమ్మత్తుకోసం ZA409 నెంబర్ గల మరో హెలికాప్టర్ లో మరో ఇద్దరు ఆఫీసర్లు ఒక మెకానికల్ ఇంజినీర్ రావడం జరిగింది.వచ్చిన హెలికాప్టర్ తిరిగి వెళ్లిపోవడంతో మరమ్మత్తు జరుగుతున్న క్రమంలోనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి రవిచంద్ర తన వాహనం తన సిబ్బందితో కలిసి రోడ్డు ఇక్కడికి చేరుకున్నారు.అనంతరం సాంకేతిక లోపంతో ఉన్న ఎయిర్ హెలికాప్టర్‌ను మరమ్మత్తు చేసి తీసుకెళ్లారు.
Tags: Emergency landing helicopter