EMLC Graduate Voter Registration Awareness Seminar

ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు అవగాహన సదస్సు

Date:20/10/2020

భువనగిరి ముచ్చట్లు

భువనగిరి జిల్లా కేంద్రంలో ఆల్  మేవ యడాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షరీఫ్ ఉద్దీన్ ఆధ్వర్యంలో  భువనగిరి పట్టణం లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్  ఓటరు నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆల్ మేవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓవైసీ ఖాద్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:మ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలో ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఎన్నికల్లో ఇచ్చిన ఏ యొక్క హామీని ఎంతవరకు నెరవెర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు..2018 సంవత్సరం లో ప్రగతి భవనంలో  అన్ని  ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. 2018 జూన్ నాటి ఐఆర్,2018 ఆగస్టు నాటి పీఆర్సి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ 29 నెలలు అవుతున్న ఇంతవరకు ఐఆర్,పీఆర్సి,డిఏ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగస్తుల మీద చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. జేఏసీ నాయకులు సీఎం అంటేనే వణికి  పోతున్నారని, ఫలితంగా ఉద్యోగస్తుల సమస్యలు పుట్టల పేరుకు పోతున్నాయని వాటిని పరిష్కరించి ఉద్యమ కార్యచరణ ప్రణాళిక రూపొందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని,కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ , ఉపాధ్యాయ పెన్షనర్ల శత్రు వైఖరి విడనాడి వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు.  గ్రాడ్యుయేట్ ఓటరు తమ ఓటును  సరైన వ్యక్తి కి  వేయాలని కోరారు.జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ప్రతి ముస్లిం గ్రాడ్యుయేట్ ఓటు ను నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు షకీల్ బెగ్, మొహమ్మద్ వాజిద్, జిల్లా కార్యదర్శి మొహమ్మద్ జహంగీర్, కోశాధికారి ఎండీ మజీద్, సహాయ కార్యదర్శి హఫీజ్ మరియు పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు మొదలైనవారు పాల్గొన్నారు.

 

ఉత్పత్తి అయ్యే అన్నిరకాల ఎగుమతులను మన నౌకాశ్రయాల నుంచి పోయే విధంగా కృషి

Tags:EMLC Graduate Voter Registration Awareness Seminar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *