ఎమ్మెల్సీ భూభాగోతం

వికారాబాద్ ముచ్చట్లు:

 

వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ భూ భగోతం వెలుగులోకి వచ్చింది. కొన్నది ఒక ఎకరా ఇరవై ఐదు గుంటలు. కాని కబ్జా చేసింది మాత్రం 3 ఎకరాల 10 గుంటలు .పూడూరు మండల కేంద్రానికి చెందిన తిప్పని నర్సింహులు అనే వ్యక్తి తన అవసరాల కోసం 2015 సంవత్సరంలో స్టీఫెన్ సన్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.అగ్రిమెంట్ మూడు 3 ఎకరాల 10 గుంటలకు ఉన్నప్పటికి కేవలం 1 ఎకరం 25 ఐ గుంటలకే తన కూతురు జెస్సికా పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.జీవనాధారం కోసం నర్సింహులు కుటుంబం హైదరాబాద్ కు వలస వెళ్లారు. తాము బ్రతుకుదెరువుకోసం హైద్రాబాద్ వెళ్తే స్టీఫెన్ సన్ అనుచరులు తమ పొలాన్ని కబ్జా చేసి దున్నేసారని నర్సింహులు కొడుకు వెంకటయ్య, అతని భార్య ఆరోపిస్తున్నారు.స్టీఫెన్ సన్ పొలాల మధ్యలో తమ పొలం ఉందని… ఎలాగైనా లాక్కోవాలని తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో లాక్ డౌన్ ఉన్నందున తమ పొలంలో పంట పండించుకుందామనే క్రమంలో గ్రామానికి వచ్చి చూడగా అప్పటికే తమ భూమిని కబ్జా చేశారని తెలిసిందని చెప్పారు. .మేము మా భూమి చదును చేసేందుకు వెళ్లగా స్టీఫెన్ సన్ అనుచరులు బెదిరింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తంచేశారు.ఎలాగైనా తమ భూమి తమకు ఇప్పించాలని ,స్టీఫెన్ సన్ అనుచరులతో హాని ఉందని తమ గోడు వినిపించారు…విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు భూ సమస్యలను పరిష్కరించేందుకు స్టీఫెన్ సన్ తో చర్చించగా ఈ భూవివాదంలో మధ్యలో వస్తే మీ సంగతి కూడా చూస్తానంటు బెదిరింపులకు దిగాడని స్థానిక నాయకులు చెబుతున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Emmelsie Stephenson

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *