ఉద్రిక్తతంగా ఉద్యోగులు,  ఉపాధ్యాయుల నిరసన

Date:18/09/2018
అమరావతి ముచ్చట్లు:
ఉపాధ్యాయుల ఛలో అసెంబ్లీ ఉద్రిక్తతంగా మారింది.  మంగళవారం నాడు విజయవాడ నుంచి అసెంబ్లీ వైపు వెల్లేందుకు సిద్దమైన ఉపాద్యాయులను పోలీసులు అరెస్టు చేసారు. సిపిఎస్ విధానాన్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు  చలో అసెంబ్లీకి పిలుపు నిచ్చాయి.  అందోళనకారులను  ఈడ్చుకుంటూ పోలీసులు జీపులు ఎక్కించారు.
అందోళనల భాగంగా  13 జిల్లాల నుంచి పెద్దఎత్తున ఉపాద్యాయులు విజయవాడ చేరుకున్నారు. వారంతా విజయవాడ లెనిన్ సెంటర్ లో ధర్నా చేస్తూ  చలో అసెంబ్లీకి రెఢీ అవుతుండగా పోలీసులు అరెస్టులు చేసారు. ఈ పరిస్ధితిలో అక్కడ ఉద్రిక్తతంగా మారింది.
పోలీసుల తీరుకు నీరసనగా  రోడ్డుపై ఉపాధ్యాయులు బైఠాయించారు. సోలీసులు ఉపాద్యాయులను బలవంతంగా అరెస్టు చేసారు. ఒక దశలో పోలీసులకు ఉపాధ్యాయులకు మధ్య తోపులాట జరిగింది.  దాంతో పలువురికి గాయాలు అయ్యాయి.
Tags: Emotionally protesting employees and teachers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *