Natyam ad

రుయా ముందు ఉద్యోగుల అందోళన

తిరుపతి ముచ్చట్లు:
 
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన పి ఆర్ సి ని వెంటనే రద్దు చేయాలని తిరుపతి రుయా ఆసుపత్రి ముందు పారా మెడికల్ సిబ్బంది ఆందోళనలు చేపట్టారు.  నూతన పీఆర్సీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీ ఏమైందని  ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ సంఘాల నాయకులు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా,  ఘర్షణ వాతావరణం కల్పించడానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టామన్నారు.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జీతాలలో కోత విధిస్తారా అంటూ ధ్వజమెత్తారు. అటు ఉద్యోగ ,ఉపాధ్యాయ ఐక్యతకు మద్దతు ప్రకటించారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Employee concern before Rua

Leave A Reply

Your email address will not be published.