Date:23/01/2021
తాడేపల్లి ముచ్చట్లు:
ఏపీలో ఈ రోజు పంచాయతీ ఎన్నికలుకి మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ వివరాలను వివరించడం ఒక సాంప్రదాయం. కానీ అలా ఎందుకు జరగలేదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. 2018 లో జరగాల్సిన ఎన్నికలు జరగాల్సింది. కానీ నిమ్మగడ్డ రమేష్ ప్రెస్ మీట్ చూస్తే రాజకీయ కోణంలో ఉంది. అంటే అప్పుడు చంద్రబాబుకు ఇబ్బంది అవుతుంది అని పెట్టలేదు. కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం కూడా చేశారు. ప్రభుత్వం ఎన్నికలకు సిద్దంగా లేదని చెప్పినా వినలేదని అయన అన్నారు.తన సీట్ ఖాళీ అయిపోయే ముందు ఎన్నికలు నిర్వహించాలని అనేది నిమ్మగడ్డ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు ప్రాణాలు ముఖ్యం. కానీ చంద్రబాబు హయాంలో ఎందుకు ఈ పోరాటాలు చేయలేదు. మూడేళ్ల పాటు నిద్ర పోయిన ఆయన ఇప్పుడు కళ్ళు తెరిచారు. ఉద్యోగస్తులకు కోవిడ్ సోకి చనిపోతే వారి కుటుంబానికి ఎవరు ఆధారమని ప్రశ్నించారు. ప్రెస్ మీట్ పెట్టడానికి మీరే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరి ఉద్యోగులవి ప్రాణాలు కాదా. కోవిద్ టీకా కోసం ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఎన్నికలను వాయిదా వేయమంటున్నము గానీ ఎన్నికలు అంటే భయంతో మాత్రం కాదు. దుర్మార్గమైన ఆలోచనలతో వ్యవహరిస్తున్నారు. ఇది చాలా విచిత్రమైన ధోరణి. నిమ్మ గడ్డ, చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ లో ఉంటారు. ప్రజలు, ఉద్యోగుల సమస్యలు వారికి లెక్క లేవు. సీఎస్ లేఖ మీడియాకు లీక్ అయిందని చెప్తున్న నిమ్మగడ్డ రమేష్ గతం చంద్రబాబు, తన మధ్య జరిగిన లేఖ ఎలా బయటకు వచ్చింది అనేది నిమ్మగడ్డ కు తెలియదా. ఏకగ్రీవాలకు ఒప్పుకోరు అంట….. ఇదెక్కడి వ్యవహారం. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు. అన్ని విషయాల్లో చంద్రబాబు జోక్యం చేసుకుంటున్నాడు. రాక్షసులకు శిక్షలు తప్పవనేది పురాణాల్లో ఉన్నాయని అంబటి వ్యాఖ్యానించారు.
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags: Employees are not alive, MLA Ambati Rambabu