ఉద్యోగులకు ఐఆర్‌, సిపిఎస్‌ రద్దుపై హర్షం

Employees IRE and CPS dissolve the announcement

Employees IRE and CPS dissolve the announcement

Date:08/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలోని ఉద్యోగులందరికి ఐఆర్‌ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రకటించారు. అలాగే సీపీఎస్‌ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేస్తూ మంత్రి మండలిలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

27 శాతం ఐఆర్‌ ప్రకటించడం హర్షనీయం….

ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే 27 శాతం ఐఆర్‌ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పి సచివాలయంలో తొలిరోజు ప్రకటన చేసి, మాట నిలుపుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌. దీనిని ఉద్యోగులు స్వాగతీస్తున్నాం. అలాగే సిపిఎస్‌ రద్దు చేస్తున్నామని చెప్పడం హర్షనీయం. వైఎస్సార్సీపి ప్రభుత్వం చరిత్రను తిరగరాసింది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

– జి. వరదారెడ్డి, జెఏసీ చైర్మన్‌ , పుంగనూరు

సీపీఎస్‌ రద్దు హర్షనీయం……

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సిపిఎస్‌ను రద్దు చేస్తామని సచివాలయంలో ప్రకటించడం హర్షనీయం. ఎన్నికల హామిని తొలి రోజే అమలు పరిచేందుకు చర్యలు తీసుకోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఉద్యోగుల సమస్యలపై స్పందించే ముఖ్యమంత్రికి మా సహకారం ఎల్లప్పుడు అందిస్తాం.


-జి. హరికిషోర్‌రెడ్డి. టీచర్‌ , పుంగనూరు.

ముఖ్యమంత్రి ప్రకటన హర్షనీయం…

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయానికి వచ్చిన తొలిరోజు ఉద్యోగులకు ఐఆర్‌ 27 శాతం విడుదల చేస్తామని ప్రకటించడం హర్షనీయం. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత వేగంగా స్పందించలేదు. ముఖ్యమంత్రి మంత్రి మండలిలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో లక్షలాది మంది ఉద్యోగులకు చేయూతనిచ్చారు.

– ఎన్‌.వాణిలక్ష్మి, టీచర్‌, పుంగనూరు

ఉద్యోగులపై గౌరవమే….

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తొలిరోజు ఐఆర్‌ ఇస్తూ సిపిఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించడం శుభపరిణామం. రాష్ట్రంలోని ఉద్యోగులపై ముఖ్యమంత్రికి ఉన్న గౌరవానికి నిదర్శనం ఉద్యోగ సమస్యల పరిష్కారం. రాష్ట్ర చరిత్రలో ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి ఇంత త్వరిత గతిన నిర్ణయాలు తీసుకోలేదు. ఉపాధ్యాయులు తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

– ఎం.రెడ్డిరాజేశ్వరి, టీచర్‌, పుంగనూరు

 

మంత్రి మండలి ప్రమాణస్వీకారోత్సవం ప్రత్యక్ష ప్రసారాలు

Tags: Employees IRE and CPS dissolve the announcement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *