ఎంఎస్ఎంఈల ద్వారా 3 లక్షల 35 వేల మందికి ఉపాధి పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి

Employees' Minister N Amarnath Reddy is Minister for 3 lakhs 35,000 through MSMEs

Employees' Minister N Amarnath Reddy is Minister for 3 lakhs 35,000 through MSMEs

Date:15/08/2018
నెల్లూరు  ముచ్చట్లు:
ఎంఎస్ఎంఈల ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉండడంతో ఆ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి తెలిపారు. ఈ రంగంలో గడిచిన నాలుగేన్నరేళ్లలో రాష్ర్టంలో 13 వేల కోట్లకు సంబంధించిన పెట్టుబడితో 23 వేల ఎంఎస్ఎంఈలు ఏర్పాటయినట్లు ఆయన వెల్లడించారు. వీటి ద్వారా 3 లక్షల 35 వేల మందికి ఉపాధి దక్కినట్లు మంత్రి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటికే 76 నియోజకవర్గాల్లో భూమి గుర్తించినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే 36 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఇ పార్కులను ప్రారంభిస్తామని, దీనికి సంబంధించిన ఫైల్ పై సోమవారమే సంతకం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎంఎస్ఎఇ పార్కులలో మౌళిక వసతులు ఏర్పాటు చేసేందుకు రూ.240 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గతేడాది ఎంఎస్ఎంఇ డే రోజున రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఇ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, దానికి సంబంధించిన విధివిధానాలన్నింటినీ రూపొందించామని తెలిపారు.
విశాఖ పట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సుల్లో అధిక భాగం మెగా, భారీ పరిశ్రమలకు సంబంధించిన ఎంఓయులే అధికంగా జరిగాయని, అందుకోసం తిరుపతిలో ఎంఎస్ఎంఈలకు మాత్రమే సంబంధించిన కన్ క్లేవ్ ను త్వరలో నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.ఇక ప్రైవేటు భాగస్వామం ఎంఎస్ఎంఇ పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి తెలిపారు. ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఎంఎస్ఎంఇ పార్కులను అన్ని మౌలిక వసతులతో అభివృద్ది చేయాలనుకుంటే వారికి ప్రభుత్వం తరుపున ఎకరాకు రూ.10 లక్షల రాయితీలు అందిస్తామని తెలిపారు.
రాష్ర్టంలో ఇప్పటి వరకు స్థాపించిన ఎంఎస్ఎంఇలకు రూ. 2 వేల కోట్ల రాయితీలు ఇచ్చినట్లు చెప్పారు. గత ప్రభుత్వాల్లో పారిశ్రామికవేత్తలు రాయితీలు పొందేందుకు ఆఫీసుల చుట్టూ తిరిగే వారని ప్రస్తుతం అలాంటి సమస్య లేదని మంత్రి అన్నారు. పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఆన్ లైన్ లోనే రాయితీలన్నీ విడుదల చేస్తున్నామని తెలిపారు.
Tags:Employees’ Minister N Amarnath Reddy is Minister for 3 lakhs 35,000 through MSMEs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *