ప్రభుత్వవారధులుగా సచివాలయ ఉద్యోగులు

Employees of Government Secretariat

Employees of Government Secretariat

– ఎంపీ రెడ్డెప్ప

Date:15/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోజహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వానికి , ప్రజలకు మధ్యన వారధులుగా పని చేయాలని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప కోరారు. మంగళవారం సాయంత్రం మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సచివాలయ ఉద్యోగులతో రెడ్డెప్ప ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఆధ్వర్యంలో సచిచాలయ ఉద్యోగుల ఎంపిక ఎంతో పారదర్శకంగా నిర్వహించారని కొనియాడారు. దేశచరిత్రలో ఎక్కడా లేని విధంగా గ్రామస్వరాజ్యపాలన వైఎస్సార్సీపి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఆకార్యక్రమాన్ని అమలు జరిపే బాధ్యత పుంగనూరు ఎమ్మెల్యేగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతులు మీదుగా జరగడం పుంగనూరు ప్రజల అదృష్టమన్నారు. ఈ ప్రాంత ఉద్యోగులందరు అర్హతలతోనే ఎంపికైయ్యారన్నారు. ఉద్యోగులు తమ విధి నిర్వహణలో నీతినిజాయితీగా పని చేస్తూ ప్రజలందరికి నవరత్నాలను అందజేయాలని కోరారు. ఇక్కడ నుంచి ప్రారంభమైయ్యే సచివాలయ పాలన ర్ఖా•నికే ఆదర్శంగా నిలవాలని , ఇందుకోసం ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, టౌన్‌మిషన్‌ కోఆర్డినేటర్‌ రవి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధిహామి పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తాం

Tags: Employees of Government Secretariat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *