Employees of ministries must act on the instructions of municipal authorities

సచివాల ఉద్యోగులు మున్సిపల్‌ అధికారుల సూచనల మేరకు పని చేయాలి

– నిర్లక్ష్యం చేస్తే చర్యలు
– కమిషనర్‌ వర్మ హెచ్చరికలు

Date:13/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు మున్సిపాలిటిలో పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులందరు మున్సిపాలిటి పరిధిలోని అధికారుల సూచనల మేరకు ప్రజల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, విధులకు హాజరుకాకపోయిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం ఆయన పట్టణంలోని సచివాలయ ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా ఆదేశాల మేరకు సచివాలయంలోని అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు , మున్సిపాలిటిలోని అయా విభాగాల అధికారుల సూచనల మేరకే పని చేయాలన్నారు. కొంత మంది కార్యదర్శులు క్రమశిక్షణ లేకుండ మాట్లాడటం, విధులకు రాకపోవడం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ లేకపోయినా, విధుల్లో నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకుని సంబంధిత ఉద్యోగులపై జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపుతామని ఆయన హెచ్చరించారు. కొంత మంది సచివాలయాలలో ప్రజల పట్ల , సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని , అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని , వీటిపై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, అందులో యువతను భాగస్వామ్యులను చేసి, ప్రజలకు సేవలు అందించే కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు విఘాతం కలిగించకుండ సచివాలయ ఉద్యోగులు పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, ఆర్‌ఐ తిరుమలరావు, సీవన్‌ జ్ఞానప్రకాష్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏమిలేనోడికి బిడ్డను ఎలా ఇస్తా….

Tags: Employees of ministries must act on the instructions of municipal authorities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *