పుంగనూరులో బాలకార్మికులను పనుల్లో పెట్టుకోవడం నేరం -న్యాయమూర్తి కార్తీక్‌.

పుంగనూరు ముచ్చట్లు:

బాల కార్మికులను పనులకు పెట్టుకోవడం నేరమని అలాంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కార్తీక్‌ అన్నారు. ఆదివారం స్థానిక బాలికల హాస్టల్‌లో ఆజాదీకా అమృత్‌ మహ్గత్సవ్‌లో భాగంగా న్యాయవిజ్ఞాన సదస్సును న్యాయమూర్తి నిర్వహించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటుతూ జాతీయ జెండాను ప్రతి ఇంటిపైన ఎగురవేయాలన్నారు. అలాగే మైనర్‌బాలికలను వేధించినా, వారిని ఏవిధమైన బాధలకు గురిచేసినా శిక్షార్హులన్నారు. ఇలాంటి వారు ఫిర్యాదు చేస్తే వివరాలను రహస్యంగా ఉంచి , కేసులు నమోదు చేసి, నిందితులను శిక్షించడం జరుగుతుందన్నారు. ఈ కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాలకార్మికులను, బాలికలను ఎవరు వేదించినా ఫిర్యాదులు చేయాలని , వారికి రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌, హాస్టల్‌ సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.

 

Tags: Employing child labor in Punganur is a crime – Justice Karthik.

Leave A Reply

Your email address will not be published.