Employment should be accelerated with the participation of all

అందరి భాగస్వామ్యంతో ఉపాధి పనులు వేగవంతంచేయాలి

– ఈజిఎస్‌స్టేట్‌ కౌన్సిల్‌మెంబరు విశ్వనాధం, పెద్దిరెడ్డిలు ఆదేశం
– జాబ్‌కార్డుగల ఇంటికి వంద రోజులు పూర్తిచేయించాలి
– లక్ష్యాల సాధనలో శాఖలసమన్వయంలో పనిచేయండి
– సిబ్బందికి ,మండల ప్రజలకు మాస్క్ లు పంపిణీ

Date:03/06/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

రైతులు, ప్రజాప్రతినిథులు, సచివాలయ , వైఎస్సార్‌ క్రాంతి పథకం సిబ్బంది అందరి భాగస్వామ్యంతో మండలం లో ఉపాధిహామీ పనులు వేగవంతంచేయాలని ఈజిఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌మెంబరు ఎం. విశ్వనాధం సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రివర్యులు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలమేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో మూడు శాఖల సమన్వయంతో సమీక్ష జరిగింది. ఈ సంధర్భంగా విశ్వనాధంమాట్లాడుతూ కోవిడ్‌-19 వలన పనులు లేక కూలీలు ఇబ్బందులు పడరాదనే ఉద్దేశ్యంతో సీఎంజగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి ల సూచనలమేరకు కూలీలు పనిచేసిన వెంటనేవారం రోజుల్లో వేతనాలు చెల్లీస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు,రైతులు సద్వినియోగంచేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం భూ అభివృద్ది, పండ్లతోటల పెంపకంతోపాటు సుమారు 236 ర కాల పనులు ఉపాధిహామీ పథకంలో చేసుకొనే అవకాశం ఉందని సిబ్బంది గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలు తెలిపి పథకంలో లబ్దిపొందడానికి అందరిని చైతన్యం కల్పించాలన్నారు.జిల్లా అధికారులు కేటాయించిన లక్ష్యాలను అధిగమించడానికి అందరు పనిచేయాలన్నారు. వేసవి అలవెన్స్ ప్రభుత్వం చెల్లిస్తోందని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి పనులు కేటాయించి వం దరోజులు పనిదినాలు కల్పించేదిశగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కూలీలు పనిచేస్తే వారికి బిల్లులు సకాలంలో చెల్లించేవారుకారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని వారం రోజుల్లో వేతనాలు చెల్లీస్తున్న ఘతన జగన్‌ ప్రభుత్వానిదన్నారు. ఉన్నతాధి కారులు కేటాయించిన లక్ష్యాలను అధిగమించడానికి మూడు శాఖలు అనుసంధానంతో పనులు చేసి కూలీల సంఖ్యను పెంచాలన్నారు.రైతులను భాగస్వాములు చేసి వారి పొలాల్లో అభివృద్ది చేసుకొనేందుకు పనులు కేటాయించి వారి ద్వారా చేయించి ఆర్థికంగా , జీవనోపాధి మెరుగుపర్చడానికి కృష్రిచేయాలన్నారు.సిబ్బంది అక్రమాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐపీపీ మెంబరు అంజిబాబు,జెడ్పిటీసీ దామోదరరాజు, ఎంపీపీ అభ్యర్థి రామమూర్తి, సింగిల్‌విండో చైర్మన్‌ మునస్వామిరాజు, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, ఎంపీటీసీలు రూపారేఖ,నరసింహులు, సుధాకర్‌రెడ్డి, ఏఎంసీ డైరక్టర్‌ రవిరెడ్డి, సాధిక్‌, ఎంపీడీఓ శంకరయ్య, ఏపీడి శ్రీనివాసులు తదితరులున్నారు.

 

ప్రతి ఒక్కరికీ మూడేసి మాస్కులు…….

మండలంలోని ప్రతి ఒక్కరికీ మూడేసి మాస్క్ లు చొప్పున పంపిణీ చేయాలని మంత్రి వర్యులు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలమేరకు బుధవారం పంపిణీ చేశారు. మండలంలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, కార్మికులకు రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, విశ్వనాధం, నేతల తో కలీసి శానిటేజర్లు, మాస్క్ ల  ను పంపిణీ చేశారు. భౌతిక దూరంతోపాటు , పరిశుభ్రతను పాటించాలని పెద్దిరెడ్డి సూచించారు. మండలానికి మొత్తం 75 వేల మాస్క్ లు వచ్చాయని, వాటితో పాటు శానిటైజర్లు 1100 బాటిళ్లు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీఓశంకరయ్య తెలిపారు.

సత్యవేడు నాగలాపురం మండలాల్లో కరోనాతో ఇద్దరు మృతి..!?

Tags: Employment should be accelerated with the participation of all

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *