Natyam ad

ఖాళీ అవుతున్న పల్లెలు…

కర్నూలు ముచ్చట్లు :

పట్నం పోతాను మామ… పట్నం పోతాం మామ…. పల్లె ఇడిసి పొట్ట కూటి కోసం మేము పట్నం పోతాం మామ వినడానికి వింత అయినా కర్నూలుజిల్లాలోని బడుగు బలహీనవర్గాల కూలీల మాటలివి. కర్నూలు జిల్లా కోసిగి, సిరిగుప్ప , ఆస్పరితదితర ప్రాంతాల ప్రజలు వలస బాట పట్టారు. గత పదిహేను రోజుల జిల్లా నుంచి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 10వేలకు పైగా కుటుంబాలు ఉపాధి  కోసం వలస వెళ్లాయంటే ఇక్కడ జిల్లాలో ప్రజలు ఎంత దుర్బరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు అనేది అర్థమవుతోంది.దింతో చేసేదేమి లేక రైతులు వారితో పాటు కూలీలు సైతం వలస బాట పట్టారు. జిల్లాలో ముఖ్యంగా కోసిగిలో ఏ వీధి చూసిన తాళాలు వేసిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి ఎటుచుసిన కాలి ఇల్లు, దుమ్ము పట్టి సగానికై పైగా పల్లెలు బోసిపోతున్నాయి. పిల్లలు కూడా చదువులు మానేసి తల్లిదండ్రులతో పాటు వలస వెళ్లడంతో పల్లెలో ఉన్న బడులలో కూడా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

 

 

ఇలా ప్రతి ఏడాది కోసిగి తదితర ప్రాంతాలలో వలసల పర్వం నిత్యం కొనసాగుతూనే ఉంది.ఎన్ని ప్రభుత్వాలు మారిన వీరి జీవన విధానం మాత్రం ఎంతకీ మారటం లేదు. పైగా ఉపాధి కల్పించాల్సిన కార్మికశాఖమంత్రి గుమ్మనూరు జయరాం మరియు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వారే అయినా ఇప్పటి వరకు ప్రజలకు కనీసం ఎలాంటి భరోసా ఇవ్వలేకపోవడం అనేది ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.అధికారుల మాటలు సైతం వారి ఆపీసుల్లోని కుర్చీలకే పరిమితమయ్యాయి. ఇప్పటికావున అధికారులు ప్రజా ప్రతినిధులు మేల్కొని ప్రజలకు ఉపాధి కల్పించి వలసల పర్వం ఆపాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 

Post Midle

Tags: Empty villages…

Post Midle