ఛత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్….ఏడుగురు మావోయిస్టులు మృతి

Encounter in Chhattisgarh .... Seven Maoists have died

Encounter in Chhattisgarh .... Seven Maoists have died

Date:19/07/2018
రాయిపూర్ ముచ్చట్లు:
ఛత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్, భద్రతా దళాల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్కౌంటర్లో ఏడుగురు నక్సల్స్ మృతిచెందదినట్లు అందులో ముగ్గురు మహిళలు వున్నట్లు సమాచారం. బీజపూర్ జిల్లాలోని మిర్తూర్-గంగలూర్ పోలిస్ స్టేషన్ పరిధిలొ గురువారం  ఉదయం 6 గంటలకు ఎదురుకాల్పులు జరిగాయి. దంతెవాడ జిల్లా బోర్డర్లోని తిమినార్, పుస్నార్ గ్రామాల సమీపంలో ఈ ఘటన జరిగింది. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఎన్కౌంటర్ జరిగింది.ఘటన స్థలం తిమెనార్ ఫారెస్ట్ ఏరియా నుంచి నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, ఎస్టీఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. నక్సల్స్ స్థావరాల నుంచి రెండు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు 303 రైఫిళ్లు, ఒక 12 బోర్ రైఫిల్‌ను భద్రాతబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఆటవీ ప్రాంతాన్ని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి.
ఛత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్….ఏడుగురు మావోయిస్టులు మృతి https://www.telugumuchatlu.com/encounter-in-chhattisgarh-seven-maoists-have-died/
Tags:Encounter in Chhattisgarh …. Seven Maoists have died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *