క్రీడలకు ప్రోత్సాహం

Encourage sports

Encourage sports

Date:21/09/2018
సత్తెనపల్లి ముచ్చట్లు:
చదువుతోపాటుగా క్రీడల్లో రాణిస్తే వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని స్థానిక ఆర్ సియం (ఎస్ఎస్ఎస్) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 64 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో ఎపి సియం కప్ 2018-19 అండర్ 19 జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంటు ప్రారంభ కార్యక్రమంలో సభాపతి డాక్టర్ కోడెల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈసందర్భంగా సభాపతి మాట్లాడుతూ క్రీడా రంగంలో భారతదేశానికి కీర్తి, ప్రతిష్టలను తీసుకువచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన సింధు, కిదాంబి శ్రీకాంత్ లకు ఆర్ధిక సహాయం చేసి వారికి నివాస స్థలాలను కేటాయించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉద్యోగావకాశాలను కల్పించిందని వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆటల్లో గెలుపు, ఓటములు సహజమని అయితే గెలిచినవారు ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు కృషిచేయాలని, ఓడినవారు గెలిచేందుకు పట్టుదల కలిగి ఉండాలన్నారు.
ఆటల్లో సత్తా, నైపుణ్యం కలిగి ఉంటే అదే వారికి ఉపాధి కావచ్చని లేక ఉద్యోగావకాశాలు రావచ్చని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబానాయుడు క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారని రాజధాని అమరావతి ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాన్ని నిర్మిస్తుండడం అందుకు ఉదాహరణ అని చెప్పారు. సత్తెనపల్లి పట్టణంలో జూనియర్ కళాశాలను కూడా మార్చి అన్ని సౌకర్యాలను కల్పించి వారికి మధ్యాహ్నం భోజన వసతి కూడా కల్పించామన్నారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి పోటీలను ప్రారంభిస్తున్నట్లు సభాపతి డాక్టర్ కోడెల ప్రకటించారు. కార్యక్రమ అనంతరం సభాపతి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ఇక్కడినుంచే క్రీడల్లో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకు రావాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. శాప్ చైర్మన్ అంకమ్మ చౌదరి, మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి తదితరులు మాట్లాడారు.
Tags:Encourage sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *