Natyam ad

ఎమ్మెస్ఎంఈలకు ప్రోత్సాహం

విశాఖపట్నం ముచ్చట్లు:

రాష్ట్రంలో ఎమ్మెస్ఎంఈ లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియ జేశారు.అనకాపల్లి స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఎం ఎస్ ఎమ్ ఈ బిజినెస్ డెవలప్మెంట్ పై జాతీయ స్థాయి సమావేశము జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి అమర్నాథ్ మాట్లా డుతూ ఎమ్మెస్ఎంఈలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రోత్సహిస్తు న్నాయని అన్నారు. దీని వల్ల రాష్ట్ర ఆదాయంతో పాటు నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని ఆయన చెప్పారు. భారీ పరిశ్రమలను ఏవిధంగా ప్రోత్సహిస్తున్నామో ఎంఎస్ ఎంఈలను కూడా అంతకన్నా ఎక్కువ గా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లో 1,326 ఎమ్మెస్సీ ఎంపీలకు 2,800 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్సెంటి వ్లను విడుదల చేసిందని, అదే తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. త్వరలోనే మరో 13 వేల నుంచి 15 వేల  ఎమ్మెస్ ఎంఈలకు మూడో విడత ఇన్సెంటివ్ లు విడుదల చేస్తామని అమర్నాథ్ చెప్పారు. భారీ పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కు వగా లభిస్తాయి అని, అదే ఎమ్మెస్ ఎంఈలలో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు.

 

Tags: Encouragement to MSMEs

Post Midle
Post Midle