గ్రంధాలయ ఉత్సవాల ముగింపు

Date:20/11/2019

ఏలూరు ముచ్చట్లు:

తెలుగు, ఇగ్లీషు పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీ యాప్ ను త్వరలో ప్రవేశ పెట్టనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్-2, జిల్లా గ్రంధాలయ సంస్థ ఇన్ చార్జ్ నంబూరి తేజ్ భరత్  వెల్లడించారు. స్థానిక కేంద్ర గ్రంధాలయంలో బుధవారం 52వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  నంబూరి భరత్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధినీ విద్యార్ధులకు  ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలను డిజిటలైజేషన్ చేసి ఒక యాప్ ను రూపొందించేందుకు చర్యలు  తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థినీ విద్యార్ధిలు, పాఠకులు వారికి కావలసిన పుస్తకలను ఇంటి వద్దనే ఏ సమయంలో నైనా ఆ యాప్ ను ఓపెన్ చేసి చదువుకునే  వీలు కలుగుతుందన్నారు. అలాగే పాఠశాలకు మాదిరిగానే లైబ్రరీలకు కూడా నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తే బావుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లాలో 74 గ్రంధాలయాలు వున్నాయని, వాటిల్లో సుమారు 10 లక్షల పుస్తకాలు అందుబాటులో వున్నట్లు ఆయన చెప్పారు.  ఈ గ్రంధాలయాలలో లేటెస్ట్ పుస్తకాలను కూడా అందుబాటులో వుంచి పాఠకులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా వారం రోజులుగా ఒక పండుగ వాతావరణంతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు.  19 రకాల కార్యక్రమంల్లో సుమారు 3 వేల మంది విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొనడం చాలా సంతోషదాయమని అన్నారు.

 

 

 

 

 

 

 

గతానికి, వర్తమానానికి ఒక వారధిలా గ్రంధాలయాలు నిలుస్తాన్నారు. మహనీయుల అనుభవాల నిక్షేపాలు ఈ గ్రంధాలయాల  విలువ చెప్పడం ఎవరితరం  కాదని ఈ సందర్భంగా భరత్ అన్నారు. ఎంఎల్ సి రాము సూర్యారావు మాట్లాడుతూ పేదవాళ్ల దేవాలయాలు  ఈ గ్రాంధాలయాలని చెప్పారు. పేదలు పుస్తకలు కొని చదువు కోలేని పరిస్ధితుల్లో వుంటారని అటువంటి వారికి గ్రంధాలయాలు ఒక వరమని అన్నారు. ఎందరో పేదలు గ్రంధాలయాలను ఉపయోగించుకుని మంచి పదవుల్లో  ఇతర రంగాలలో అభివృద్ధికి చేరుకున్నారని చెప్పారు.   జిల్లా కేంద్ర గ్రాంధాలయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు నూతన భవనాన్ని నిర్మించి సేవలను మరింత విస్తృత  పర్చాలని  రాము సూర్యారావు సూచించారు. అనంతరం గ్రాంధాలయ వారోత్సవాల సదర్భంగా విద్యార్ధినీ విద్యార్ధులు లకు నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన, చదరంగం, సాంస్కృతిక తదితర పోటిలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ కార్యదర్శి పి.రవి కుమార్, సర్ సిఆర్ కళాశాల విశ్రాంత  అసోసియేట్ ప్రొఫెసర్ యల్ వెంకటేశ్వరరావు, గ్రంధాలయ సంస్థ ఉద్యోగులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

 

అచ్చంపేటలో మంత్రి తలసాని పర్యటన

 

Tags:End of library celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *