Natyam ad

ముగిసిన ప్రచారం.. అర్ధం కాని నాడీ

నల్గోండ ముచ్చట్లు:

మునుగోడు.. దేశం దృష్టినే ఆకర్షిస్తున్న ఉపఎన్నిక ఇది. ప్రచారం క్లైమాక్స్‌కు వచ్చే సరికి.. ఫైటింగ్ వేరే లెవల్‌కి వెళ్లింది. ఇన్నాళ్లూ ఆరోపణలు, సవాళ్లకే పరిమితమైన రాజకీయ నేతలు ఇప్పుడు భౌతిక దాడులకూ వెనుకాడటం లేదు. అటు సెంట్రల్ బలగాలు.. ఇటు లోకల్ పోలీసులు మొహరించినా క్షణక్షణం టెన్షన్ నెలకొంది. అసలే ప్రిస్టేజియస్ ఎన్నికలు.. పీక్ స్టేజ్ ప్రచారం.. పైగా రెండు పార్టీలకు అసలే పడదు. ఇంక కార్యకర్తలు ఎదురుపడితే ఊరికే ఉంటారా? ఒకరిపై ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు వర్గాలను కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. దీంతో మునుగోడులో ఎన్నికల ప్రచారం ముగియడంతో.. పోలీంగ్ జరిగి ఫలితాలు వచ్చేవరకు హైటెన్షన్ ఉండనుంది.ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న ప్రధాన రాజకీయపార్టీలు ఇప్పుడు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు వచ్చి ఓట్లేసేలా ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాయి పార్టీలు.మరోవైపు డబ్బు, మద్యం పంపిణీకి తెరతీశాయి.

 

 

 

ప్రచారం ముగింపు రోజున టీఆర్ఎస్ తరఫున మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు రోడ్‌షోలు నిర్వహించనుండగా..బీజేపీ కొన్ని మండలాల్లో బైక్‌ ర్యాలీలు, కాంగ్రెస్‌ మహిళా గర్జనను నిర్వహించనున్నాయి.298 పోలింగ్‌ బూత్‌లలో 2,41,855 మంది మునుగోడు ఓటర్లు రాజకీయ పార్టీల భవిష్యత్తును తేల్చనున్నారు. ఇక్కడ ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్, బీజేపీలు పూర్తిగా కేంద్రీకరించి పని చేయగా, కాంగ్రెస్‌ కూడా తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు పోరాడింది. మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.బీఎస్పీ తరఫున అభ్యర్థి కూడా గట్టి ప్రచారం చేసింది. ఆ పార్టీ ఓ మోస్తరు ఓట్లు పొందే అవకాశం ఉండటంతో ఆ ప్రభావం ఎవరిపైన పడుతుందనేది చర్చనీయాంశంగా మారింది. కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొన్ని గ్రామాల్లో బలంగా ప్రచారం నిర్వహించారు.

 

Post Midle

Tags: Ended campaign.. Nervous without sense

Post Midle

Leave A Reply

Your email address will not be published.