Natyam ad

అంతులేని ఆధార్ అవస్థలు

తాండూరు ముచ్చట్లు:

ప్రతి ప్రభుత్వ పథకాలకు సంక్షేమాలకు ఆధార్ తప్పనిసరి కావడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. అందులో ఒకే సెంటర్ పోస్ట్ ఆఫీస్ ఉండడంతో ఆధార్ అప్డేట్ కోసం జనాలు ఆధార్ ఆధార్ అంటూ ఉదయం 4 గంటల నుంచి చలిలో వరుస క్రమంలో నించొని పోస్ట్ ఆఫీస్ వద్ద బారులు తీరుతున్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో చోటుచేసుకుంది వివరాలకు వెళ్తే.. తాండూర్ పట్టణ కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ వద్ద నిత్యం ఆధార్ అప్డేట్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా సుమారు రోజుకు 30 నుంచి 40 మంది వరకే ఆధార్ అప్డేట్ చేస్తున్నారు. అయితే తాండూర్ నియోజకవర్గంగా ఆధార్ సెంటర్ల్లు సరిగా లేకపోవడంతో,ప్రతిదానికి ఆధార్ అవసరం ఉండడంతో ప్రజలు ఉదయం నాలుగు గంటలకు వరుస క్రమంలో నించవలసి వస్తుంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం పోస్ట్ ఆఫీస్ వద్ద ఉదయం నాలుగు గంటలకే చలి లో భారీ ఎత్తున జనాలు ఆధార్ అప్డేట్ కోసం ఏగబడ్డారు. లోపలికి చోచ్చుకోయే ప్రయత్నం చేశారు. దీంతో జనాలపై ఆధార్ నిర్వాహకులు మండిపడ్డారు, ఓ మేర వారిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. దీనితో మరింత పరిస్థితి ఉదృతంగా మారింది. ఆ తరువాత ఆధార్ టోకెన్ల కోసం నాలుగు రోజులు ఐదు రోజుల డేట్లు వేసి ఇచ్చే టోకెన్ల కోసం కూడా ప్రజలు ఏగబడ్డారు. పరిస్థితి గమనించిన పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దుబాటు చేస్తున్నారు. అయినా ప్రజలు మాట వినడం లేదు.

Post Midle

Tags: Endless Aadhaar statuses

Post Midle