అంతు పట్టని తుమ్మల వ్యూహాలు…

ఖమ్మం ముచ్చట్లు:


తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు తెలియని వారు ఉండరు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న తుమ్మల ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పవర్ ఫుల్ లీడర్.2018 శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత జరిగిన పరిణామాల్లో ఖమ్మంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వర్గపోరు కారణంగా తీవ్రంగా మనస్థాపం చెందిన తుమ్మల ఇటీవల పార్టీ వ్యవహారాలకుఅంటిముట్టనట్లుగా ఉంటున్నారు. అలాంటి తుమ్మల సడెన్‌గా ప్రగతి భవన్ మెట్లు ఎక్కడం తెలంగాణ రాజకీయంలో హాట్ టాపిక్ అయింది. మంగళవారం ఆయన ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ తో భేటీఅయ్యారు. దాదాపు గంట పాటు ఇరువురు నేతలకు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తుమ్మల రాజకీయంగా కాస్త సైలెంట్ అయ్యారు. పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం

 

చేసే వారికి గుణపాఠం చెప్పాలని గతంలో తుమ్మల హాట్ కామెంట్స్ చేశారు. సొంత పార్టీ వారే తనకు మోసం చేశారని అయిన వారి వద్ద ఆవేదన వ్యక్తం చేసిన తుమ్మల పార్టీ మారేయోచనలో ఉన్నారనేఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించాయి. అయితే రాజ్యసభకు అవకాశం కల్పిస్తారనే ప్రచారంతో ఆ ప్రయత్నానికి ఫుల్ స్టాప్ వేశారనే టాక్ నడిచింది. ఈ క్రమంలో రాజ్యసభ స్థానానికి తుమ్మలపేరు ఖరారు చేస్తారని ప్రచారం జరిగినా కేసీఆర్ ఆ ఛాన్స్ వేరొకరికి ఇచ్చారు. రాజ్యసభ పోస్టు తనకు ఖాయం అనుకున్న తుమ్మలకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మింగుడు పడలేదట.ఉమ్మడిఖమ్మం జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఆ మీటింగ్‌కు ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా రాజ్యసభకు ఎంపికైన బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర సహా ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు కానీతుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి డుమ్మా కొట్టారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన ఈ మీటింగ్‌ను తుమ్మల లైట్ తీసుకున్నారట. ఇక కేసీఆర్‌ను నమ్ముకుంటే ఫలితం లేదని ప్రత్యామ్నాయమార్గాన్ని చూసుకోవాలని తుమ్మల భావించినట్లు చర్చ జరిగింది. తుమ్మల పార్టీ మారితే ఖమ్మంలో టీఆర్ఎస్‌కు భారీ నష్టం కలుగుతుందని భావించిన కేటీఆర్ నష్టనివారణకు రంగంలోకి దిగారట.మంత్రికేటీఆర్‌తో తుమ్మల భేటీ సందర్భంగా ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. తనకు రాజ్యసభ టికెట్ కేటాయించకపోవడానికి గల కారణాలను తుమ్మలకుకేటీఆర్ వివరించినట్లు ప్రచారం సాగుతోంది. తగిన సమయంలో రాజకీయంగా అవకాశం తప్పకుండా వస్తుందని అప్పటి వరకు వర్గవిభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం కృషి చేయాలని సర్దిచెప్పినట్లుతెలుస్తోంది. మరి కేటీఆర్‌తో భేటీ తర్వాత తుమ్మల తన నిర్ణయం మార్చుకుని అందరితో కలిసి ముందుకు వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. తాజా ఎపిసోడ్‌తో ఖమ్మం జిల్లా రాజకీయాలు మరోసారిహాట్ హాట్‌గా మారాయి.

 

Tags: Endless squirrel tactics …

Natyam ad