షాకింగ్ న్యూస్ లో ఎనర్జిటిక్ గా  జూనియర్ సమేత

Energetic junior compatibility in shocking news

Energetic junior compatibility in shocking news

Date:11/09/2018
హైద్రాబాద్   ముచ్చట్లు:
త్రివిక్రమ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్ చిన్నపాటి బ్రేక్ తో మళ్ళీ షూటింగ్ ఊపందుకుంది. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ అకాల మరణంతో మూడు నాలుగురోజుల పాటు షూటింగ్ కి బ్రేకిచ్చింది. అరవింద సమేత షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఎన్టీఆర్ కూడా తండ్రి మరణంతో కూడిన దుఃఖాన్ని దిగమింగుకుని. అరవింద సమేత షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ఇక ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎన్టీఆర్ సాంగ్ షూటింగ్ లో ఎనర్జీ తో పాల్గొన్నారని… తన బాధను గుండెల్లో దాచుకుని… ఆ సాంగ్ షూట్ లో ఎనర్జి లెవల్స్ తో పాల్గొన్నాడని ట్వీట్ చేసాడు. ఇక ఎన్టీఆర్ నార్మల్ స్థితికి రావడం అరవింద సమేత టీమ్ తోపాటుగా ఎన్టీఆర్ ఫాన్స్ కి ఆనందాన్నిచ్చింది.ఇక తాజాగా అరవింద సమేత గురించిన షాకింగ్ అప్ డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాని, వెబ్ మీడియాని షేక్ చేస్తుంది.
అరవింద సమేతకి సంబందించిన ఆ క్రేజీ అప్ డేట్ ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ ని ఒక ఊపు ఊపేస్తోంది. అయితే ఆ వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం అరవిందపై వస్తున్న ఆ న్యూస్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మరింది. ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ అరవింద సమేత లో ఒక అతిధి పాత్రలో మెరవబోతున్నాడనే న్యూస్ వైరల్ అయ్యింది.
అరవింద సమేత వీర రాఘవ కోసం అమితాబ్ ఒక స్పెషల్ గెస్ట్ రోల్ లో మెరవబోతున్నాడనే న్యూస్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. అయితే అందులో నిజమెంతుందో క్లారిటీ లేదుగాని.. ప్రస్తుతం అయితే అమితాబ్ సౌత్ మూవీస్ లో గెస్ట్ అండ్ ఫుల్ లెన్త్ రోల్స్ చేస్తున్నాడు. మనం సినిమాలో నాగార్జున కోరిక మేరకు డాక్టర్ పాత్రలో గెస్ట్ రోల్ లో నటించాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి సై రా నరసింహారెడ్డి లో సై రా గురువుగారి పాత్రలో అమితాబ్ నటించాడు.
ఇంకా ఒక తమిళ్ ఫిలిం లో అమితాబ్ ఫుల్ లెన్త్ రోల్ ప్లే చెయ్యబోతున్నాడు. మరి తాజాగా అమితాబ్ అరవింద సమేత వీర రాఘవ లో కూడా ఒక గెస్ట్ రోల్ ప్లే చేస్తాడంటే… రూమరని చెప్పలేం కానీ… నిజమనే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే..ఇప్పటివరకు అమితాబ్ గురించి త్రివిక్రమ్, ఎన్టీఆర్ సంప్రదించినట్టుగా ఎక్కడా న్యూస్ లేదు. మరి నిజామా.. లేదా.. అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 11 న దసరా కానుకగా అరవింద మూవీ విడుదలకు మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
Tags:Energetic junior compatibility in shocking news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *