ప్రియాంక చోప్రా లవర్ తో ఎంగేజ్ మెంట్

Engagement with Priyanka Chopra Lover

Engagement with Priyanka Chopra Lover

Date:18/08/2018
ముంబై ముచ్చట్లు:
ప్రియాంక చోప్రా ఎంగేజ్‌మెంట్ అయిపోందనే.. రూమర్లకు ఇక తెరపడింది. అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌, ప్రియాంక చోప్రా ఎంగేజ్‌మెంట్ శనివారం ముంబైలో జరిగింది. వీరి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ప్రియాంకను నిక్ ముద్దాడుతుండటం.. వారి వెనుక NP అనే ఆంగ్ల అక్షరాల డేకరేషన్‌తో ఉన్న ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వీరి ఎంగేజ్‌మెంట్ వేడుకకు అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది.
జూన్లో ఇండియా వచ్చిన నిక్.. మరోసారి ముంబై రావడంతో కచ్చితంగా ఏదో కారణం ఉంటుదని భావించారంతా. అందుకు తగ్గట్టుగానే నిక్, ప్రియాంక ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అమెరికాకి చెందిన సింగర్ నిక్ జోనస్‌, ప్రియాంక చోప్రా మధ్య గత ఏడాది కాలంగా ప్రేమాయణం నడుస్తోంది. ినక్ కంటే ప్రియాంక పదేళ్లు పెద్దది కావడం గమనార్హం.
ప్రియాంక బర్త్ డే రోజే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని మీడియాలో వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఎంగేజ్‌మెంట్ కావడంతో.. అవన్నీ రూమర్లేనని తేలిపోయింది.
Tags:Engagement with Priyanka Chopra Lover

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *