దుర్గమ్మ సన్నిధితో ఇంగ్లాంగ్ ఆటగాళ్లు
విజయవాడ ముచ్చట్లు:
మంగళవారం నాడు ఇంగ్లాండ్ కు చెందిన అండర్ -19 క్రికెట్ బృందం 19 మంది శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ పాలకమండలి వారు, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా పాలకమండలి సభ్యులు మరియు ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డ్ సభ్యులు బుద్ధా రాంబాబు, కట్టా సత్తయ్య, కేసరి నాగమణి, సహాయ కార్యనిర్వాహ ణాధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Tags: England players with the presence of Durgamma

