English medium in schools from next academic year

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో బోదన

– ఎంఈవో కేశవరెడ్డి

Date:14/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

రానున్న విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోదనను పటిష్టంగా ప్రారంభిస్తున్నట్లు ఎంఈవో కేశవరెడ్డి తెలిపారు. పుంగనూరు బసవరాజ ప్రభుత్వ హైస్కూల్‌లో శుక్రవారం ఆంగ్ల బోధనపై ఉపాధ్యాయుల శిక్షణ రెండవ విడత కార్యక్రమం ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో కేశవరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఆంగ్లబోదనతో పాటు గణితం, పరిసరాల విజ్ఞానంతో పాటు ఆంగ్లబాష నైపుణ్యాలను పెంపొందించేలాంటి అంశాలలో ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోదన కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పటిష్టమైన బోధన , క్రమశిక్షణతో విద్యార్థులకు తర్పీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 23 వరకు విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహించి, బెస్‌లెస్‌ పరీక్షల అనంతరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమంలో బోధన చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం వెంకట్రమణారెడ్డి, డైరెక్టర్‌ వేణుగోపాల్‌, ఆర్‌పీలు నాగరాజ, కిషోర్‌కుమార్‌రెడ్డి, బుడ్డన్న, శరత్‌కుమార్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మామిడి , టమోటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి

Tags: English medium in schools from next academic year

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *