ఎంసెట్ రీ షెడ్యూల్

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఈనెల 13,14,15వ తేదీల్లో జరగాల్సిన టీఎస్‌ ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఈసెట్‌ ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడ్డ ఈ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈనెల 30,31 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షను, ఆగస్టు, ఆగస్టు 1న ఈసెట్‌, ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు టీఎస్‌ పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. అభ్యర్థులు తమ తమ హాల్‌ టికెట్లను ఆయా వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.అయితే భారీ వర్షాల కారణంగా మొదట మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. జూలై 13న నిర్వహించాల్సిన ఈసెట్‌ పరీక్షను వాయిదా వేసింది. మిగతా పరీక్షలు యధివిధిగా జరుగుతాయని వెల్లడించింది. అయితే జూలై14, 15న భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించడంతో విద్యాసంస్థల సెలవులను సైతం మరో మూడు రోజులకు పొడిగించింది. ఆ రెండు రోజుల్లో జరగాల్సిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను విద్యామండలి వాయిదా వేసింది. దీంతో వాయిదా పడిన పరీక్ష తేదీలను రీషెడ్యూల్‌ చేసింది.

 

Tags: Enset re-schedule

Leave A Reply

Your email address will not be published.