ప్రజల ఆరోగ్యానికి భరోసా – మంత్రి పెద్దిరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
ప్రజలకు అన్ని రకాల కార్పోరేట్ వైద్యసేవలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ ఆరోగ్యశ్రీలో అన్ని రకాల జబ్బులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ షన్‌మోహన్, చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి మున్సిపాలిటి పరిధిలోని తూర్పుమొగశాల, రాగానిపల్లె రోడ్డులో రూ.1.60 కోట్లతో నిర్మించిన రెండు అర్భన్ హెల్త్ సెంటర్లను మంత్రి ప్రారంభించారు. అలాగే శాంతినగర్‌లో రూ.90 లక్షలతో విద్యుత్‌లైన్ల మార్పిడి కార్యక్రమ పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే చెర్లోపల్లె వద్ద రూ.97 కోట్లతో 220 కెవి సబ్ స్టేషన్ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రితో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి అనుకూలంగా ఉండేందుకు అర్భన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించామన్నారు. అలాగే ముడిబాపనపల్లె కేంద్రం నుంచి కూడ ప్రజలకు అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. వందలాది మందికి ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద కూడ ఎప్పటికప్పుడు పరిహారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా , రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

Tags; Ensuring people’s health – Minister Peddireddy
