పుంగనూరులో మనుషులతో పాటు మూగజీవాల ప్రాణాలకు భరోసా -మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో మనుషులతో పాటు మూగజీవాల ప్రాణాలకు కూడ తగిన వైద్యసేవలు అందిస్తూ భరోసా కల్పిస్తున్నారని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ , గనులశాఖామంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పుంగనూరు మండలం రాంపల్లె వద్ద డాక్టర్‌ వైఎస్సార్‌ పశుసంచార వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవులకు పూజలు చేసి, వాటికి ఆరటిపండ్లు, బెల్లం, బియ్యం తినిపించారు. మంత్రి మాట్లాడుతూ సంచార వాహనంలో ఒక పశువైద్యుడు, వైద్య సిబ్బంది ఉంటారని తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తూ పశువులకు వచ్చిన జబ్బులను పరీక్షించి, వాటికి వైద్యసేవలు అందిస్తామన్నారు. అవసరమైతే పశువులను సంచార వాహనంలోనికి ఎక్కించి ఆసుపత్రికి తీసుకె ళ్లేలా హైడ్రాలిక్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటితో పాటు పెంపుడు కుక్కలు, పక్షలకు కూడ చికిత్సలు చేసేలా సంచార వాహనంలో సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఇంతటి విఫ్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి అన్ని వర్గాలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం , జెడ్పిటిసి జ్ఞానప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Tags: Ensuring the survival of human beings as well as dumb creatures in Punganur – Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.