అసెంబ్లీలోకి 10 మంది మహిళల ఎంట్రీ

హైదరాబాద్ ముచ్చట్లు:

 

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచుకున్నాయి. ఈ యేడాది ఏకంగా 15 మంది డాక్టర్లు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుండటం విశేషం. కాగా 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తం 33 మహిళలు పోటీ చేశారు. అయితే మొత్తం 10 మంది మహిళలు గెలుపొందగా వీరిలో తొలిసారిగా ఎన్నికైన వారే అధికంగా ఉన్నారు
1. దనసరి అనసూయ (సీతక్క): ములుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సీతక్క విజయం సాధించారు. ఆమె తన సమీప డిఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి పై సుమారు 28 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2. డాక్టర్ కొండా సురేఖ: కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ తూర్పు నుంచి పోటీచేసిన ఆమె.. బీఆర్ఎఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ పై విజయం సాధించారు. 3. మామిడాల మామిడాల యశస్వినీరెడ్డి: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి అనూహ్యంగా బరిలో నిలిచి గెలుపొందారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఆమె ఓడించారు. 4. ఎన్ పద్మావతి రెడ్డి : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద  పద్మావతి రెడ్డి కోదాడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదనై ఘన విజయం సాధించారు. 5. సునీతా లక్ష్మారెడ్డి: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని సునీతా లక్ష్మారెడ్డి జయకేతనం ఎగురవేశారు. 9వేల 167 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై సునీత ఘన విజయం సాధించారు.6. సబితా ఇంద్రారెడ్డి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి రీజర్ ఎస్ అభ్యర్థిని సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి వీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ పై ఆమె విజయం సాధించారు.7. లాస్య నందిత: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల ఓటమి పాలయ్యారు. 8. కోవ లక్ష్మి: ఆసిఫాబాద్ లో బీఆర్ఎఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అరా శ్యామ్ బీజేపీ అభ్యర్థి అజ్మీరా అత్యారామ్ నాయక్ పై గెలుపొందారు. 9. మట్టా రాగమయి: సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్లా రాగమయి జయకేతనం ఎగురవేశారు. 10. చిట్టి పర్ణిక: నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చిట్టిల వర్ణికా రెడ్డి గెలుపొందారు. బీఆర్ ఎస్ అభ్యర్థి ఎస్. రాజేందర్ రెడ్డిపై 7వేల 950 ఓట్ల ఆధిక్యతో ఆమె విజయం సాధించారు.

Tags: Entry of 10 women into the assembly

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *