పర్యావరణ పరిరక్షణ అందరి భాధ్యత – సీనియర్‌ సివిల్‌ జడ్జి వాసుదేవరావు

పుంగనూరు ముచ్చట్లు:

పర్యావరణ కాలుష్యాన్ని నివారించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీనియర్‌ సివిల్‌ జడ్జి వాసుదేవరావు అన్నారు. శనివారం న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌తో కలసి ఆయన కోర్టు ఆవరణంలో మొ క్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు వెహోక్కలు నాటి పెంచాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవాళి మనుగడకు పర్యావరణ కాలుష్యం ఎంతో విఘాతం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌ను నియంత్రించడం, కాలుష్యాన్ని నివారించడం ఎంతో అవసరమని , ఈ విషయంలో ప్రతి ఒక్కరు తమంతకు తాముగా మానవాళి మనుగడకు చేయూతనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Environmental protection is everyone’s responsibility – Senior Civil Judge Vasudeva Rao

Leave A Reply

Your email address will not be published.