పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి
నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్
నూజివీడు ముచ్చట్లు:
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నూజివీడులో సోమవారం ర్యాలీ నిర్వహించారు. నూజివీడు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి చారిత్రాత్మక చిహ్నమైన గుర్రం గేటు వరకు ర్యాలీ జరిపారు. “ప్లాస్టిక్ నిషేధం-పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం-పచ్చని ప్రకృతిని ఆహ్వానిద్దాం” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, త్రివిధ విద్యాసంస్థల అధినేత సబ్బినేని శ్రీనివాస్ లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు. ప్లాస్టిక్ ను నిషేధించేందుకు కంకణబద్ధులై ముందడుగు వేయాలని సూచించారు. పచ్చని చెట్లను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించటం పౌరులుగా బాధ్యతను గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా గుర్రం గేటు వద్ద మొక్కలను నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్, సానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, కౌన్సిలర్ కందుల సత్యనారాయణ
సచివాలయ శానిటరీ సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Environmental protection is everyone’s responsibility
