నెల్లూరు వైభవోత్సవాల్లో టిటిడి ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఈఓ   ఎవి.ధర్మారెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరులోని శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను మంగళవారం సాయంత్రం టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యులు  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం పబ్లికేషన్ స్టాల్, పంచగవ్య ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఆ తరువాత గోపూజ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.ఫొటో ఎగ్జిబిషన్లో గోవు మహత్యం, గోపూజ విశిష్టత, సప్తగోప్రదక్షిణశాల, గోసంరక్షణశాలలో దేశవాళీ ఆవుల పెంపకం, గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం, గత ఐదు దశాబ్దాల్లో శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల సంఖ్య, శ్రీవారి సేవ, నవనీత సేవ, విద్యుత్ కార్లు, లడ్డూ ప్రసాదం, పవిత్ర ఉద్యానవనాలు, అగరబత్తుల తయారీ, పంచగవ్య ఉత్పత్తుల తయారీ, శ్రీవారి పుష్ప ప్రసాదం ఫొటో ఫ్రేమ్స్ తదితరాల ఫ్లెక్సీలు పరిశీలించారు .

 

 

అదేవిధంగా, శ్రీవారి వైభవాన్ని తెలిపేలా ముద్రించిన ఆధ్యాత్మిక పుస్తకాలను టిటిడి పుస్తక విక్రయశాలలో అందుబాటులో ఉంచారు. ‘నమామి గోవింద’ పేరుతో విడుదల చేసిన పంచగవ్య ఉత్పత్తులు, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన ఫొటో ఫ్రేమ్స్ భక్తులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచారు. టిటిడి జెఈఓ  వీరబ్రహ్మం వీటి గురించి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వివరించారు.అనంతరం నమూనా ఆలయంలో నిర్వహించిన శ్రీవారి సహస్రదీపాలంకరణ సేవలో టిటిడి ఈవో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో  వీరబ్రహ్మం, ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, విజిఓ  మనోహర్, డిఇ శ్రీ రవిశంకర్ రెడ్డి, ఇఇ  సుమతి, ఎఇ  ఆంజనేయ రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Tags:EO AV Dharma Reddy inaugurated the TTD Photo Exhibition at Nellore Vaibhavotsavam.

Leave A Reply

Your email address will not be published.