Natyam ad

ఎస్వీ గోశాల‌లో పిండ‌మార్పిడి ప్రాజెక్టుపై ఈఓ సమీక్ష

తిరుపతి ముచ్చట్లు:

దేశీయ గోవుల పాల ఉత్పత్తిని పెంచేందుకు, మేలుజాతి దేశవాళీ గోవులను జన్యుపరంగా అభివృద్ధి చేసేందుకు టిటిడి చేపట్టిన పిండ మార్పిడి ప్రాజెక్టుపై ఈవో ఏవి.ధర్మారెడ్డి, ఎస్వీ పశువైద్య వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష జరిగింది. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గోశాల‌లో సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యం గ‌ల గోవుల‌కు మేలుజాతి స్వ‌దేశీ గోజాతుల పిండాల‌ను మార్పిడి చేసి కృత్రిమ గ‌ర్భ‌ధార‌ణ క‌లిగించి, ఆశించిన ఫ‌లితాలు పొందేందుకు పిండ‌మార్పిడి విధానం దోహ‌ద‌ప‌డుతుందన్నారు. దీనివ‌ల్ల అంత‌రించిపోతున్న భార‌తీయ గోజాతుల ప‌రిర‌క్ష‌ణ‌, అభివృద్ధి సాధ్య‌మ‌వుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని పశువైద్య వర్సిటీ అందించాలని కోరారు. ఈ ప్రాజెక్టు కాల పరిమితి ఐదేళ్లు కాగా, దీనిని నాలుగేళ్లకు తగ్గించాలని కోరారు.

 

 

Post Midle

ఈ సందర్భంగా పిండ మార్పిడి ప్రాజెక్టు పురోగతిపై ఎస్వీ పశువైద్యవర్సిటీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.అనంతరం గోశాలలో జరుగుతున్న ఫీడ్ ప్లాంట్ నిర్మాణంపై ఈఓ సమీక్షించారు.ఈ సమీక్షలో జెఈఓ  సదా భార్గవి, ఎఫ్.ఏ సియేవో శ్రీ బాలాజీ, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి, ఎస్వీ పశువైద్య వర్సిటీ డీన్, పిండమార్పిడి ప్రాజెక్టు ఇన్చార్జి ఆచార్య వీరబ్రహ్మయ్య, రిజిస్ట్రార్   రవి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ టెన్షన్ ఆచార్య వెంకటనాయుడు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆచార్య సర్జన్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:EO Review of Embryo Transplantation Project at SV Goshala

Post Midle