శ్రీనివాస సేతు పనుల పురోగతిపై ఈవో సమీక్ష
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు ప్రాజెక్టు పనుల పురోగతిపై టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి బుధవారం టీటీడీ పరిపాలన భవనంలోని తమ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మే 31 నాటికి ప్రాజెక్టు మొత్తం పనులు పూర్తి చేసి జూన్ 15వ తేదీ నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కోరారు. రోడ్ల మధ్యలో మీడియన్స్ అభివృద్ధి కోసం అవసరమైన స్థలాన్ని వెంటనే కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద గ్రిడ్డర్స్ పనులను త్వరగా చేపట్టాలని కోరారు. ప్రస్తుతం పూర్తయిన 92 శాతం పనుల పురోగతిని వచ్చే బోర్డు సమావేశంలో తెలిపేందుకు వీలుగా సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు.ఈ సమీక్షలో జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.హరిత, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎఫ్ఏసిఎఓ బాలాజీ, కార్పొరేషన్ ఎస్ఇ మోహన్, ఈఈ చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Tags: EO review on progress of Srinivasa Setu works
