టోకెన్ జారీ కేంద్రాలను పరిశీలించిన ఈఓ
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని సర్వదర్శన టోకెన్ జారీ కేంద్రాలను టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈరోజు అర్ధరాత్రి నుండి టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది. సర్వదదర్శన టోకెన్ల జారీకి ఏర్పాట్లు అధికారులు పూర్తిచేసారు.
టిటిడి ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవింద రాజ సత్రాల్లో టోకెన్ల పంపిణీ చేస్తారు. భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, సదుపాయాలు ఏర్పాటు చేసారు. శని, ఆది, సోమవారాల్లో రోజుకు 25వేల టోకెన్ల జారీ చేస్తారు. మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో రోజుకు 15 వేల టోకెన్ల జారీ చేస్తారు. ఏరోజుకు ఆరోజు దర్శన టోకెన్ల జారీ చేయనున్నారు. టోకెన్లు అయిపోగానే కౌంటర్లు మూసివేస్తారు. టోకెన్ లేని భక్తులు తిరుమలకు వచ్చి సర్వదర్శనానికి వెళ్లవచ్చు. సర్వ దర్శన టోకెన్ల సంఖ్య క్రమంగా పెంచి భక్తులందరికీ ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తామని అన్నారు.
Tags: EO which inspected token issuing centers

