Natyam ad

పుంగనూరులో సంక్షేమ పథకాలతో ప్రజలు లక్షలాధికారులు – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే నవరత్నాల పేరుతో అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు లక్షాధికారులు అయ్యారని, ఈ విషయాలను గడప గడపకు కార్యక్రమంలో వివరించడం జరుగుతోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని ఇటుకనెల్లూరు, బత్తలాప్రురం, నెక్కుంది గ్రామాల్లో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మంత్రి పీఏ చంద్రహాస్‌, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి జగనన్న బుక్‌లెట్‌లు పంపిణీ చేసి వివరించారు. లబ్ధిదారులు ఒకొక్కరికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అందిందని తెలిపి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిరకాలం ఉండాలని ఆకాంక్షించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మండలంలో అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందించడంతో లక్షాధికారులుగా మారారని, ప్రతి కుటుంబము ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు నారాయణరెడ్డి, శంకరప్ప, ఆంజప్ప, సుధాకర్‌, ఎంపీటీసీలు సురేంద్ర, పురుషోత్తం, వేమారెడ్డి, రామకృష్ణారెడ్డి, భాస్కర, శివ, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, హేమాద్రి, రాజశేఖర్‌రెడ్డి, రాగానిపల్లె బాబు, ప్రభాకర్‌నాయక్‌, చంద్రారెడ్డి యాదవ్‌, వెంకటరెడ్డి, గురివిరెడ్డి , నారాయణరెడ్డి, రెడ్డెప్ప, బాలచంద్రారెడ్డి , లక్ష్మన్న, బాబు, పురుషోత్తం , రెడ్డెప్ప, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: eople are millionaires with welfare schemes in Punganur – MPP Akkisani Bhaskar Reddy

Post Midle