ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…

కడప ముచ్చట్లు:


శాశ్వత లోక్‌ అదాలత్‌ ద్వారా ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి.దీని ద్వారా సత్వర న్యాయం పొందవచ్చునని  పర్మినెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీస్ సర్వీసెస్ చైర్మన్ ఎస్. ప్రసాద్  ప్రజలకు  పిలుపునిచ్చారు.
శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని తన కార్యాలయంలో శాశ్వత లోక్‌ అదాలత్‌ సేవలు,ప్రజా ఉపయోగ సంబంధిత అంశాల పై జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ కవిత తోకలసిఆయనపాత్రికేయులు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పర్మినెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీస్ సర్వీసెస్ చైర్మన్ ఎస్ ప్రసాద్  మాట్లాడుతూ… ప్రజోపయోగ సేవల వ్యాజ్యాల పరిష్కారానికి శాశ్వత లోక్‌ అదాలత్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. అందులో భాగంగా  ట్రాన్స్ పోర్ట్,బ్యాంకింగ్‌, ఆర్థిక సంస్థలు,ఇన్సూరెన్స్, పోస్టల్‌, టెలీగ్రాఫి, నీరు, విద్యుత్‌, పారిశుధ్యం, ఆస్పత్రి సేవలు, బీమా సేవలు,ఉపాధి హామీ పథకం, విద్యా సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ ,ఉద్యోగ ఉపాధి తదితర రంగాలకు చెందిన వ్యాజ్యాలను పరిష్కరించుకునే అవకాశం ఉందని వివరించారు. చట్ట ప్రకారం రాజీ చేయదగ్గ సేవలను శాశ్వత లోక్‌ అదాలత్‌లో పరిష్కారం చేయవచ్చునని తెలిపారు. సత్వర న్యాయం పొందడానికి 2002లో శాశ్వత లోక్ అదాలత్ చట్టాన్ని అమలులోకి తీసుకు రావడం జరిగిందన్నారు. ఈ చట్టం  సెక్షన్ 22 ఏ బి  సి డి ఇ ప్రకారం ప్రజలకు 10 రకాల సేవలను శాశ్వత లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ  సర్వీసులలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలిగిన ,నష్టాలు జరిగినా అర్జీలు సమర్పించి ఈ శాశ్వత లోక్ అదాలత్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకొని న్యాయం పొందవచ్చునని  తెలిపారు.

 

 

ఈ పర్మినెంట్ లోక్ అదాలత్ పై ప్రజలందరూ అవగాహన పొంది ఈ శాశ్వత లోక్ అదాలత్ కోర్టు ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ కవిత మాట్లాడు తూ…న్యాయసేవాధికార సంస్థ ద్వారా  న్యాయ సేవలు, సలహాలు  పొందవచ్చని తెలిపారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందరికీ న్యాయం అందించాలనే ఉద్దేశంతో  స్త్రీలు, షెడ్యూలు కులాలు, షెడ్యూలు ట్రైబ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, చిన్నపిల్లలు, మూడు లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరూ న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు, సలహాలు పొందవచ్చునని తెలిపారు. ఉచిత న్యాయ సేవలు పొందగోరేవారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లో పిటిషన్ దాఖలు చేస్తే చట్టప్రకారం ఉచితంగా న్యాయ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రతిరోజు పదిన్నర గంటల నుండి 5 గంటల వరకు న్యాయ సేవాధికార సంస్థ లో ఉచితంగా అర్జీలు, లీగల్ అడ్వైజులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  ప్రతి ఒక్కరూ చట్టాలపైన అవగాహన కలిగి ఉండి లోక్ అదాలత్ ద్వారా సమస్యలను పరిష్కరించుకో గలరని పిలుపునిచ్చారు. రాజీ పడదగిన అన్ని రకాల సివిల్, క్రిమినల్ కేసులను ఇరు పార్టీల కక్షిదారులు అంగీకరయోగ్యమైన సత్వరపరిష్కారంపొందవచ్చన్నారు.ఈ సమావేశంలో సమాచార పౌరసంబంధాల శాఖ డి ఐ పిఆర్వో పి. వేణుగోపాల్ రెడ్డి,కోర్ట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: eople should take advantage of free legal services…

Leave A Reply

Your email address will not be published.