అశ్వ‌వాహ‌నం శ్రీ‌ గోవింద‌రాజ‌స్వామి అభ‌యం

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం అశ్వ‌వాహ‌నం శ్రీ గోవిదంరాజ‌స్వామివారు అభ‌య‌మిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ నిర్వ‌హించారు.అశ్వాన్ని అధిరోహించిన స్వామివారు ఇంద్రియ నియామకుడు. స్వామి అశ్వ వాహనంపై దర్శనమిచ్చి, తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ తనను శరణు కోరడం ద్వారా కలిదోషాలకు దూరం కావచ్చునని తెలియజేస్తారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  రాజేంద్రుడు, ఏఈవో  ర‌వికుమార్‌రెడ్డి, ఇతర అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags:Equestrian Shri Govindarajaswamy Sanctuary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *