Natyam ad

నవరత్నాలతోనే పేదరిక నిర్మూలన

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలతో పేదరిక నిర్మూలన జరిగిందని, ప్రతి కుటుంబం ఆర్థికాభివృద్ధి చెందారని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా అన్నారు. మంగళవారం వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమాన్ని పట్టణంలోని నానబాలవీధి సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేశారు. మానమ్మకం నువ్వే జగన్‌ బుక్‌లెట్లను పంపిణీ చేసి, డిజిటల్‌ బోర్డులను ఆవిష్కరించారు. చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల ఆదేశాల మేరకు పేదరికమే ప్రామానికంగా సంక్షేమ పథకాలు అందించామన్నారు. మున్సిపాలిటి పరిధిలో కోట్లాదిరూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు  నయీంతాజ్‌, కాళిదాసు, సచివాలయాల కన్వీనర్‌ వరదారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు కిషోర్‌, ఇంతియాజ్‌, రమణ , అస్లాంమురాధి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Eradication of poverty with Navratnas

Post Midle