Natyam ad

నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యత- మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యం

– ఇంటింటికి కొళాయిలచే నీరు
– జాతీయ రహదారికి అనుసంధానం
– హెచ్‌ఎన్‌ఎస్‌ కాలువ విస్తరణ

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ముప్పె ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదు సంవత్సరాలలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటుతో చేపట్టాం. గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులు గుర్తించి ఏర్పాటు చేశామని రాష్ట్రమంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన మనోభావాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో పుంగనూరును పారిశ్రామిక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పుంగనూరు మండలంలోని ఆరడిగుంటను పారిశ్రామిక జోన్‌గా చేశామన్నారు. శ్రీకాళహస్తికి చెందిన ఫెరాఆలాయి పైపుల ఫ్యాక్టరీ పనులు చురుగ్గా సాగుతోందన్నారు. అలాగే జర్మన్‌ కంపెనీకి చెందిన పెప్పర్‌ మోషన్‌ ఎలక్ట్రికల్‌ బస్సులు, ట్రక్కుల కంపెనీ ఏర్పాటుకు భూమి కేటాయించామన్నారు. రెండేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణాలు పూర్తి కాబడుతుందన్నారు. దీని ద్వారా సుమారు పది వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇలాంటి కంపెనీలు మరిన్ని ఏర్పాటు చేసేందుకు ఎంపీ మిధున్‌రెడ్డి ప్రణళికలు రూపొందించారని , ఈ మేరకు పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు కూడ జరపడం జరిగిందన్నారు. ఇప్పటికే జాబ్‌మేళా నిర్వహించి , వందలాది మంది నిరుద్యోగులను దేశ రక్షణ శాఖకు, పలు ప్రైవేటు కంపెనీలకు పంపడం జరిగిందని తెలిపారు. అలాగే చింతపండు కుటీర పరిశ్రమగా ఉందని, ఇందులో పని చేసే వారికి కూడ తగిన ప్రభుత్వ సహాయము అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పుంగనూరు నియోజకర్గంలో నిరుద్యోగ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించి, నిరుద్యోగులకు ఈ ప్రాంతంలోనే ఉపాధి కల్పించేలా పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అలాగే మైనార్టీ విద్యార్థుల కోసం ఉర్ధూ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. పుంగనూరు నియోజకవర్గాన్ని, ప్రజలను అన్ని విధాల అభివృద్ధి చేసి , రాష్ట్ర చరిత్రలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చి దిద్దుతామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

తాగునీరు- సాగునీరు….

పడమటి నియోజకవర్గాలైన పుంగనూరు, పలమనేరు, కుప్పం, మదనపల్లె, పీలేరుతో పాటు చంద్రగిరి నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ఉదారంతో ప్రాజెక్టులు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. నేతిగుట్లపల్లె రిజర్వాయర్‌, ఆవులపల్లె రిజర్వాయర్లలో సుమారు మూడన్నర టిఎంసీల నీటిని నిల్వ చేసి రైతులకు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు ప్రారంభిస్తే పచ్చగ్యాంగ్‌కు మనుగడ లేకుండ పోతుందన్న దురాలోచనతో కోర్టులో కేసులు వేసి పనులు ఆపివేశారన్నారు. త్వరలోనే వీటిపై కోర్టులు విచారణ జరిపి, రిజర్వాయర్ల పనులకు అనుమతులు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాది లోపు నీటిని విడుదల చేస్తామన్నారు. దీని ద్వారా సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమన్నారు. అలాగే వాటర్‌గ్రిడ్‌ పథకం క్రింద గండికోట రిజర్వార్‌ నుంచి పైపులైన్ల ద్వారా నియోజకవర్గానికి నీరు తీసుకొచ్చే కార్యక్రమం చురుగ్గా సాగుతోందన్నారు. ఏడాది లోపు పనులు పూర్తి చేసి, ఇంటింటికి కొళాయిల ద్వారా మంచినీరు అందిస్తామన్నారు. అలాగే హంద్రీనీవా కాలువలను విస్తరించి , పలమనేరు మీదుగా కుప్పంకు నీటిని పుష్కలంగా అందించే కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అలాగే హంద్రీనీవా కాలువల నీటిని ఉప కాలువలు ఏర్పాటు చేసి వాటి ద్వారా చెరువులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. పుంగనూరు పట్టణంలో కౌండిన్య నదిలో మురుగునీటి కాలువలను నిర్మించి, నీటి నిల్వలు లేకుండ చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా ఉన్న మిధున్‌రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు.

Tags: Eradication of unemployment is priority – Minister Peddireddy’s goal

Post Midle