పల్లె ప్రగతిలో పాల్గోన్న మంత్రి ఎర్రబెల్లి

జనగామ ముచ్చట్లు:


ఈ నెల 3వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహిస్తున్న 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం నాడు జనగామ జిల్లా ఈర వెన్ను, బమ్మెర గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.. గ్రామాల్లో వాడవాడలా విస్తృతంగా పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడిక్కడే వారి సమస్యలు పరిష్కరించారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేశారు.. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

 

Tags: Errabelli, a minister involved in rural development

Leave A Reply

Your email address will not be published.