ఎంపి బండి సంజయ్,ఎంపీ అర్వింద్ లకు విమర్శించే స్థాయి మంత్రి ఎర్రబెల్లి లేదు బీజేవైఎం జిల్లా కార్యదర్శి సాడిగే మహేష్

కోరుట్ల   ముచ్చట్లు:

బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి లను విమర్శించే స్థాయి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి లేదని బీజేవైఎం  జగిత్యాల జిల్లా కార్యదర్శి సాడిగే మహేష్  ఆగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సాడిగే మహేష్ మాట్లాడుతూ
కేంద్రం నిధులతో నిర్మించిన, నిర్మించనున్న పనులకు ప్రారంభోత్సవం,శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,అదే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. దమ్ముంటే గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇంకోసారి బీజేపీ పార్టీ ఎంపీలపై కేంద్ర ప్రభుత్వం పై అవగాహన లేమి మాటలతో విమర్శిస్తే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రుణమాఫీ పై మంత్రిని సాధారణ రైతు ప్రశ్నిస్తే బీజేపీ కార్యకర్త అని సభ నుంచి గెంటి వేయించడం దొర అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, బీజేవైఎం సీనియర్ నాయకులు సంజీవ్,  బీజేవైఎం ప్రెసిడెంట్ ఠాకూర్ ప్రవీణ్ సింగ్, ప్రధాన కార్యదర్శి చెట్లపెళ్లి సాగర్, ధామ శ్రవణ్, ఉప అధ్యక్షుడు ఉరుమడ్ల నరేష్,కంఠం శ్రీనివాస్, వోటారీకారి నవీన్, కాసుల వంశీ , బిజెవైఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Errabelli does not have the level to criticize MP Bandi Sanjay and MP Arvind
BJYM District Secretary Sadige Mahesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *