అఖిల భారత డ్వాక్రా బజార్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

Date:21/09/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

భారతీయ స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన చేనేత, హస్తకళల, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం కార్యక్రమాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు  ప్రారంభించారు. ప్రభుత్వ విప్ గొంగడి సునీత, బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, సెర్ప్ సీఈవో పౌసుమిబసు,ఎస్.బి.ఐ ఎజిఎం ఉమాశంకర్, సిండికేట్ బ్యాంకు ఎజిఎం అరోరా, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో అక్టోబర్ 1వరకు జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం(సెర్ప్)- కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మహిళా
స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు ప్రదర్శనకు, అమ్మకానికి 300 స్టాళ్లు ఏర్పాటయ్యాయి. 1999- 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా రెండు సార్లు సరస్ మేళా నిర్వహిస్తారు.

 

 

 

మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అన్ని విజయాలకు మహిళలే కారణం. మహిళలు వ్యాపారంలో ఎన్నో స్ఫూర్తిదాయక విజయాలను నమోదు చేశారు. స్వయం సహాయక సంఘాలఏర్పాటుతో గ్రామాల్లో, మహిళా సాధికారతలో కొత్త ప్రస్థానం మొదలయ్యింది. మహిళల కోసం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా విజయవంతమవుతాయని అన్నారు. మహిళాసంఘాలలోని వారు తమ విజయంతో కుటుంబాలను నిలబెడుతున్నారు. ఆహారంలో అన్ని ఉత్పత్తులు కల్తీ అయ్యాయి.  మహిళా సంఘాలు నాణ్యత కలిగిన ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. ఆహార ఉత్పత్తుల తయారీలో మహిళలకు చేయూత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కూరగాయల యూత్ జరిగేలా చర్యలుతీసుకుంటున్నాం.  బ్యాంకులు మహిళా సంఘాల అభివృద్ధికి చేయూత ఇస్తున్నాయి. సరస్ మేళాను హైదరాబాద్ లోని ప్రతి ఒక్కరూ సందర్శించాలని అన్నారు.

మోహన్ లాల్‌పై కేసు

Tags: Errabelli is the minister who initiated the All India Dwakra Bazaar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *