అర్చకులకు నిత్యావసర వస్తువులు

పిఠాపురం ముచ్చట్లు:

 

కరోనా సెకండ్ వేవ్ లో కూడా జీవనోపాధి కోల్పోయి,ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న పిఠాపురానికి చెందిన పలువురు నిరుపేద పురోహితులు,అర్చకులు,బ్రాహ్మణులకు పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆజ్ఞ మేరకు 25కిలోల బియ్యం,నిత్యావసర సరుకులు అందజేశారు.పీఠం నూతన ఆశ్రమంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్,అజీమా జహెరమ్మ సేవాసంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమర్ అలీషా సోదరులైన అహ్మద్ అలీషా,హుస్సేన్ షా హాజరై,తమ  చేతులమీదుగా బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను అందజేశారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు అహ్మద్ అలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు,ప్రతినిధులు శివరామకృష్ణ,షహెన్ షా,బ్రాహ్మణ సేవాపరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Essentials for priests

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *