ఎపిలో సెంట్ర‌ల్, గిరిజ‌న వ‌ర్శ‌టీల‌ను త్వ‌రిత‌గ‌తిన నెల‌కొల్పండి   కేంద్ర ఉన్న‌త విద్యా కార్య‌ద‌ర్శికి మంత్రి గంటా విజ్ఞప్తి 

Date:17/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
విభ‌జ‌న చ‌ట్టంలో హామీలైన సెంట్ర‌ల్ యూనివ‌ర్శ‌టీ, గిరిజ‌న వ‌ర్శ‌టీల‌ను క‌నీసం ఈ విద్యాసంవ‌త్సరానికైనా నెల‌కొల్పే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ఢిల్లీలో కేంద్ర ఉన్న‌త విద్యా కార్య‌ద‌ర్శి రెడ్డి సుబ్ర‌మణ్యంను కోరారు. న్యూఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో వున్న మంత్రి గంటా.. కేంద్ర ఉన్న‌త విద్యా కార్య‌ద‌ర్శి రెడ్డి సుబ్ర‌మ‌ణ్యం, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌ను క‌లిశారు. విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయాల్సిన బాధ్య‌త కేంద్రంపైన వుంద‌ని, ఆ మేర‌కు అనంత‌పురంలో సెంట్ర‌ల్ యూనివ‌ర్శ‌టీ, విజ‌య‌న‌గ‌రంలో గిరిజ‌న వ‌ర్శ‌టీని ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం వుంద‌న్నారు. క‌నీసం ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచైనా ఏర్పాటు చేసే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాలన్నారు. దీనిపై రెడ్డి సుబ్ర‌మ‌ణ్యం స్పందిస్తూ…  తాత్కాలిక ప్రాంగ‌ణంలో వ‌ర్శ‌టీల‌ను ప్రారంభిద్దామ‌ని, ఆ మేర‌కు టెంప‌ర‌రీ అకామిడేష‌న్ ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసి త‌మ‌కు పంపాల‌ని సూచించారు.  అదే విధంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్ర ఉన్న‌త‌ విద్యాసంస్థ‌ల‌కు నిధులు స‌రైన రీతిలో అంద‌డం లేద‌ని, వీటికి నిధులు వెనువెంట‌నే ఇవ్వాల‌ని కోరారు. ఐఎఫ్ఐ ద్వారా నిధులు అందించేలా చర్య‌లు చేప‌డ‌తామ‌ని మంత్రి గంటాకు… రెడ్డి సుబ్ర‌మ‌ణ్యం తెలిపారు.   స‌మావేశంలో మంత్రి గంటా వెంట విశాఖ ఎంపీ హ‌రిబాబు వున్నారు.
Tags:Establish Central and Tribal Reports Quickly in AP
The minister urged the minister of the hour to the higher education secretary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *