Natyam ad

రూ.2 కోట్లతో బోయకొండలో డయాబెటిక్‌ సెంటర్‌ ఏర్పాటు- మంత్రి పెద్దిరెడ్డి చొరవతో ఎకరం స్థలం కేటాయింపు

— స్థల పరిశీలన అనంతరం అధికారులతో చర్చించిన బృందం
— లయ న్స్ క్లబ్‌ వారి సేవలు అభినందనీయమన్న పెద్దిరెడ్డి

 

చౌడేపల్లె ముచ్చట్లు:


పుణ్యక్షేత్రమైన బోయకొండలో రూ:2 కోట్ల వ్యయంతో పేదరోగులకు ఉచితంగా వైద్య సేవలందించడానికి లయ న్స్ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ వారి సహకారంతో డయాబెటిక్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు లయ న్స్ క్లబ్‌ జిల్లా అంబాసిడర్‌ డాక్టర్‌ శివ తెలిపారు. ఆదివారం బోయకొండ ఆలయ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఆలయ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిలను లయన్స్క్లబ్‌ బృందం కలిశారు. ఈ సంధర్భంగా డాక్టర్‌ శివ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పివి మిథున్‌రెడ్డిలను ఇటీవల కలిసి బోయకొండలో డయాబెటిక్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయడానికి స్థలం కేటాయించాలని వినతిచేయగా మంత్రి స్పందించి వెంటనే బోయకొండలో ఎకరా స్థలంను కేటాయించారన్నారు. ఈ స్థలంను సభ్యుల బృందంతోపాటు పెద్దిరెడ్డి, చైర్మన్‌, ఈఓ పరిశీలించారు. లయ న్స్ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా గ్రాంట్‌ 317ఈ ద్వారా నిధులు సమకూర్చి భవన నిర్మాణం చేప్రట్టనున్నట్లు చెప్పారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ పుంగనూరు తో పాటు పలు పట్టణాల్లో లయన్స్ క్లబ్‌ ఆధ్వర్యంలో డయాబెటిక్‌ సెంటర్ల ఏర్పాటుతో పాటు , పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలిస్తున్నారని ప్రసించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొన్నారు. అధికారులు పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ మునితుకారం, ఏపి టూరిజంశాఖ డైరక్టర్‌ భాస్కర్‌రెడ్డి, గ్లోబుల్‌ యాక్షన్‌ టీం అధినేత ప్రతాఫ్‌యాదవ్‌, పీఆర్‌ఓ వరదారెడ్డి, నేతలు సోమల మల్లికార్జునరెడ్డి, ఇంమ్రాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Establishment of Diabetic Center at Boyakonda with Rs.2 Crores- Allotment of acre of land on the initiative of Minister Peddireddy

Post Midle