Natyam ad

పుంగనూరులో ఎలక్ట్రికల్‌ బస్సుల కంపెనీ ఏర్పాటు- మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల కృషి ఫలితం

– సీఎం క్యాంపు ఆఫీసులో ఎస్‌ఐపీబి ఆమోదం

విజయవాడ ముచ్చట్లు:

Post Midle

పుంగనూరు మండలం ఆరడిగుంట ఇండస్ట్రీయల్‌ కారిడార్‌లో ఎలక్ట్రికల్‌ బస్సుల నిర్మాణ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు ఆమోదం తెలిపింది. సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్‌ఐపిబి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ , లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి పుంగనూరు మండలంలో సుమారు రెండువేల ఎకరాలను పారిశ్రామిక కారిడార్‌కు కేటాయించారు. కాగా పుంగనూరులో ఎలక్ట్రికల్‌ బస్సు పరిశ్రమకు ఆమోదం లభించడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్రంలో పలు పరిశ్రమలకు ఎస్‌ఐపిబి గ్రీన్‌ సిగ్నిల్‌ ఇచ్చింది. ఇందులో  మొత్తం రూ. 19037 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 69,565 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు ఎస్‌ఐపిబి తెలిపింది.

 

Tags: Establishment of electric bus company in Punganur – the result of efforts of Minister Peddireddy and MP Midhun Reddy

Post Midle