Date:05/12/2020
పత్తికొండ ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కె.ఈ శ్యామ్ కుమార్ ఆదేశాలు మేరకు పత్తికొండ టిడిపి మండల కన్వీనర్ బత్తిన లోకనాధ్ గారి ఆధ్వర్యంలో పత్తికొండ మండల తెలుగు మహిళా మరియు ఎస్టి సెల్ కమిటీల సభ్యులను ఎన్నుకున్నారు. శనివారం రోజున స్ధానిక తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పత్తికొండ మండల తెలుగు మహిళ మరియు ఎస్టి సెల్ కమిటీల ఎన్నిక కోరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు సాంబ శివ రెడ్డి,మనోహర్ చౌదరి,అశోక్ కుమార్,రామా నాయుడు,తిరుపాలు,కడవల సుధాకర్, తెలుగుదేశం పార్టీ తుగ్గలి మండల కన్వీనర్ తిరుపాల్ నాయుడు,తెలుగుదేశం పార్టీ తుగ్గలి మండల మహిళ అధ్యక్షురాలు రాతన ఈరమ్మ, కార్యకర్తలు పాల్గొన్ని నూతన కమిటీ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
పత్తికొండ మండల తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ముంతాజ్ బేగం, ఉపాధ్యక్షురాలిగా చంద్రకళ,ప్రదాన కార్యదర్శిగా పార్వతమ్మ,కోశాధికారి నాగవేణి,కార్య నిర్వాహక కార్యదర్శులుగా లక్ష్మీదేవి,జమీలా, ఉమాదేవి,కార్యదర్శులుగా రంగమ్మ,ఆశాబేగం, జ్యోతి లను ఎన్నుకోవడం జరిగింది.అదే విధంగా పత్తికొండ మండలం ఎస్టి సెల్ నూతన కమిటీ సభ్యులు అధ్యక్షులు రవీంద్ర నాయక్, ఉపాధ్యక్షులు క్రిష్ణ నాయక్,ప్రధాన కార్యదర్శి చక్రి నాయక్,కోశాధికారిగా వెంకటప్ప నాయక్,కార్య నిర్వాహక కార్యదర్శులు శ్రీనివాస్ నాయక్,రాజు నాయక్,రంజిత్ నాయక్,పుల్లయ్య నాయక్ లను అందరి సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.నూతన కమిటీ సభ్యులను టిడిపి నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి శ్యాం బాబు కు మరియు మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తికి,టిడిపి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ మరియు తుగ్గలి మండలం టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం- మంత్రి పెద్దిరెడ్డి
Tags: Establishment of EST Cell Committee