పుంగనూరు జగనన్న కాలనీలలో మౌలికవసతులుఏర్పాటు – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Date:13/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీలలో మౌలికవసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి రాంపల్లెలో ఏర్పాటు చేస్తున్న కాలనీలలో మంచినీటి బోరుకు పూజలు చేసి, పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలోని రాంపల్లె, భీమగానిపల్లె, మార్లపల్లె, రాంపల్లె బైపాస్‌ రోడ్డు , బోడేవారిపల్లె ప్రాంతాలలోసుమారు అర్భన్‌, రూరల్‌ పరిధిలోని పేదలందరికి సుమారు 1200 మందికి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు కాలనీలలో ఒకొక్క బోరు వేయనున్నట్లు తెలిపారు. అలాగే కాలువలు, రోడ్లు, వీధి దీపాలతో పాటు, ప్రతి ఇంటి వద్ద మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టి, ఆదర్శకాలనీలుగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన ప్రతి ఒక్కరు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి అండగా నిలిచి, జగనన్న ప్రభుత్వం చిరకాలం ఉండేలా ఆశీర్వధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, పార్టీ నాయకులు రమణ, జనార్ధన్‌, సుబ్రమణ్యం, హేమంత్‌, మహేష్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఐదు సచివాలయాలు ఏర్పాటు…

మండలంలోని అడవినాథునికుంట, మేలుందొడ్డి, ఏటవాకిలి, కుమ్మరగుంట, ఉలవలదిన్నె గ్రామాల్లో ఐదు సచివాలయాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని భాస్కర్‌రెడ్డి కొనియాడారు. మండలంలోని అన్ని పంచాయతీలలోను 26 సచివాలయాలు ఏర్పాటైందన్నారు. వనమలదిన్నె పంచాయతీలో రెండు, రాగానిపల్లెలో రెండు, భీమగానిపల్లెలో రెండు ఏర్పాటైందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పరిపాలన వికేంద్రీకరణ వేగవంతంగా జరుగుతోందని తెలిపారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags;Establishment of Infrastructure in Punganur Jagannath Colonies – Akkisani Bhaskar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *