Natyam ad

కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 8న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్

విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం

కడప ముచ్చట్లు:

కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 8న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని విద్యార్థి యువజన నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీరాములు గౌడ్,పీ.డీ.ఎస్.యూ జిల్లా కార్యదర్శి బి. మహేంద్ర బాబు,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రంగప్ప,ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర,ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రాజీవ్,డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సురేష్,ఏఐఎస్ఏ,పీడీఎస్ఓ తాలూకా నాయకులు రాజు,సురేంద్ర బాబు లు మాట్లాడుతూ అనేక త్యాగాలతో విద్యార్థి యువజన నాయకుల 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ జరుగుతున్న పోరాటం నవంబర్ 8 నాటికి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడంతో పాటు నవంబర్ 8వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కి పిలుపునిచ్చారు.. లాభాలు వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఫ్యాక్టరీ అనుబంధంగా ఇనుము గనులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడిన అమరవీరుల త్యాగాలు స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యం చేస్తామన్నారు. రాయలసీమ ప్రాంతం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న హామీ ఇంతవరకు ఏ మాత్రం అమలు చేయలేదని తెలిపారు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు..కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధికి నిధులు ఇవ్వకపోయినా నూతన పరిశ్రమలు ఏర్పాటు వంటి విభజన హామీలు అన్నిటిపై నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్రంలోని బిజెపి నేతలు మోడీని ఎందుకు అడగడం లేదని విమర్శించారు.. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పెద్దలు నిద్ర నటిస్తున్నారని రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమంత్రికి వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు కేసుల భయంతో మోడీ ముందు మోకరిల్లుతున్నారని భయపెట్టారు రాష్ట్ర విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రం ఒక్క పైసా కూడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రెండు సార్లు శంకుస్థాపన చేసిన ఆచరణలో పురోగతి లేదన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక యువతికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.. నవంబర్ 8వ తేదీ వరకు జిల్లాలో అన్ని మండలా నియోజకవర్గ కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పత్రిక సమావేశాలు సదస్సులు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు నవంబర్ 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కేజీ టు పేజీ వరకు జరిగే విద్యాసంస్థల బంద్ కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపే సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు విజేంద్ర, రంగస్వామి,మునిస్వామి,రామకృష్ణ, నరసింహ రెడ్డి ,విజయ్, ఖాదర్, సమీర్,రామకోటి,చక్రి,రవి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Establishment of Kadapa steel factory, bandh of educational institutions across the state on 8th for protection of Visakha steel

Post Midle