నంద్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు

-థాంక్యూ సీఎం సార్ అంటూ ర్యాలీ
 
నంద్యాల ముచ్చట్లు:
 
నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా గా ఏర్పాటు చేసినందుకు  విద్యార్థి సంఘాలు మరియు వైయస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా నంద్యాల ప్రజల చిరకాల వాంఛను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చినందుకు వారికి నంద్యాల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ స్టూడెంట్ యూనియన్స్ వైఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంటు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినందుకు నంద్యాల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న ఉన్నారు ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ ను ఎన్నో దశాబ్దాలుగా జిల్లా కావాలని కలగా మిగిలిపోయిందని ఏ నాయకుడు కూడా ముందుకు రాని పరిస్థితి మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసి  చరిత్రలో నిలిచి పోయారన్నారు గతంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఎన్టీరామారావు నుండి లాగేసుకుని ఒక్క రోజు కూడా ఎన్టీ రామారావు పేరు పెట్టాలన్న ఆలోచన కూడా చేయలేదని పరిస్థితి ప్రజలు కూడా  చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరని ఎలక్షన్ సమయంలో మాత్రం ఎన్టీ రామారావు పేరును వాడుకోవడం జరుగుతుంది కానీ  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ పేరును జిల్లాగా ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది గతంలో కూడా ఎంతో మంది గొప్ప నాయకుల పేర్లను జిల్లాలో ప్రకటించడం జరిగిందని నేడు కూడా ఎన్టీ రామారావు పేరును ప్రకటించినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  సాయి రామ్ రెడ్డి, మణికంఠ రామచంద్రుడు ,రాజు నాయుడు, రియాజ్,  గురు లోకేష్ ,దినేష్, స్టూడెంట్స్ యూనియన్స్ మరియు వై ఎస్ ఆర్ సి పి స్టూడెంట్స్ యూనియన్స్ వైఎస్ఆర్సిపి యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Establishment of Nandyal as the district headquarters